ఐదు మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము), అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము), కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు.
క్షేత్రము అంటే కేవలము కనిపించే ఈ శరీరమే కాదు ఈ క్షేత్రము పంచభూతములతో ఏర్పడింది. ఈ క్షేత్రములో పంచభూతములు, పంచతన్మాత్రలు (శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు), పది ఇంద్రియములు, బుద్ధి, మనసు, అహంకారము, ప్రకృతి, ఈ ఇరవైనాలుగు తత్వములు కలిసి క్షేత్రము అని అంటారు. ఈ క్షేత్రములో ఉన్న పదార్ధములు ఒకదానితో ఒకటి కలిసినపుడు వికారములు కలుగుతాయి. అవే కోరికలు, ద్వేషములు, సుఖము, దుఃఖము, తెలివి (జ్ఞానము), మనస్సులో చేసే సంకల్పాలు, ధైర్యము అనే వికారములతో కూడినదే ఈ క్షేత్రము. క్షేత్రము అంటే మన శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి కూడా క్షేత్రమే. అందులో నుండే ఈ జీవులు అన్నీ పుడుతున్నాయి. పెరుగుతున్నాయి. ఈ శరీరాలు అన్నీ ప్రకృతిలో భాగమే. శరీరంలో ఉండే మనసు, బుద్ధి, అహంకారము వలన కలిగే వికారములు అనగా సుఖదుఃఖము, ఇవన్నీ కూడా క్షేత్రము యొక్క లక్షణాలే.